Cooking Oil: తక్కువ నూనెతో రుచిగా భోజనం ఎలా వండాలో తెలియట్లేదా..? గృహిణులకు అద్భుతమైన చిట్కాలు

|

Nov 10, 2024 | 1:18 PM

ఆరోగ్యాన్ని పదికాలాలపాటు చల్లగా కాపాడుకోవాలంటే ఆహారంలో నూనె తక్కువగా తీసుకోవాలి. నిజానికి, ఇది చాలా మందికి తెలియదు. నూనె వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వంటల్లో నూనె తక్కువగా వినియోగించడం మంచిది అంటున్నారు నిపుణులు..

1 / 5
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

2 / 5
నేటి యువతకు ఇది కాస్త కష్టమైన పనే. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ట్రైగ్లిజరైడ్స్ లేదా కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, ఊబకాయం సమస్యలు ఉన్నవారు అధిక నూనె పదార్థాలు తినకూడదు. కొన్ని ఆహార పదార్థాలను చుక్క నూనెతో వండలేనప్పటికీ, వంటలో ఉపయోగించే నూనె మొత్తాన్ని తగ్గించవచ్చు. కొంచెం నూనెతో కూడా రుచికరంగా వండుకోవచ్చు.

3 / 5
నాన్ స్టిక్ పాన్ తక్కువ నూనెతో రుచికరమైన వంట కోసం ఉపయోగించవచ్చు. దీనికి కొద్దిగా నూనె రాస్తే చాలు, ఆహారం బాగా ఉడుకుతుంది. అందువల్ల నూనె ఎక్కువగా వాడే ఆహారపదార్థాలకు నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించవచ్చు.

4 / 5
పాన్ లోకి నూనె నేరుగా పోయడానికి బదులుగా, ఒక చెంచా ఉపయోగించి పాన్ లోకి నూనె పోయడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నూనె వినియోగం తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి నేరుగా నూనె పోయడం మానుకోవాలి. లేదంటే మీకు తెలియకుండానే నూనె అధికంగా వినియోగించవచ్చు.

5 / 5
వేయించిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే, శరీరంలోకి తక్కువ నూనె వెళ్తుంది. బదులుగా వండిన ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. చేపలు, మాంసం, గుడ్లు వంటి ఆహారాలను తక్కువ నూనె, మసాలాలతో ఆవిరితో ఉడికించి తినవచ్చు. ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఆహారంలో వంటనూనె వాడకాన్ని తగ్గించుకోవచ్చు.