
కావాల్సిన పదార్ధాలు : నాలుగు నిమ్మకాయలు, 4 పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పూన్స్ నూనె, 5 వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర, మెంతులు పొడి, మిరియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఉల్లియాయ చిన్నది, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపును తీసుకోవాలి.

నిమ్మకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా మిర్చిని, ఉల్లిపాయను కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తీయాలి.

ఇక ఇప్పుడు లెమన్ ను తీసుకుని దానిని కట్ చేసి నిమ్మరసం ఓ బౌల్ లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో ఆవాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత దానిలో వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి దానిని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి.

ఇప్పుడు దీనిని రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు బాగా దంచుకోవాలి. చివర్లో లెమన్ జ్యూస్ పోయాలి. అంతే, రుచికరమైన నిమ్మకాయ రోటి పచ్చడి రెడీ.