
కావాల్సిన పదార్దాలు: పావు కిలో నించుడు కాయ, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ కారం , అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

నించుడు కాయలను ఇలా వేయించుకోవాలి: ముందుగా నించుడు కాయలను మూడు సార్లు బాగా కడిగి వాటిని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి నూనెలో దోరగా బాగా వేయించాలి. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది.

ఇలా నూనెలో వేయించుకోవాలి: అవి బాగా వేగిన తర్వాత నాలుగు కరివేపాకు ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు , నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బంగారు కలర్లోకి మారే వరకు వేయించాలి. ఇలా చేస్తే కూర కూడా గుజ్జు లాగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతోంది.

చివర్లో నించుడు కాయ ముక్కలను ఇలా కలుపుకోవాలి : ఇప్పుడు నించుడు కాయ ముక్కలను తీసుకుని మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఇలా చేస్తే వేడి వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది. ఇంకా ఇది అనారోగ్య సమస్యలను కూడా తరిమికొడుతుంది.

కొత్తిమీర వేసి ఇలా ఉడికించుకోవాలి: నించుడు కాయలు మొత్తం మెత్తగా అయినా తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసి 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. చివర్లో డీప్ ఫ్రై అయ్యాక స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే, వేడి వేడి నించుడు కాయల కూర రెడీ. వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు. ఇంకా ఇది డయాబెటిస్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది.