
ఒక్క పనీర్‌తో ఒకటి కాదు అనేక రకాల వంటకాలు చేసుకుని తినొచ్చు. అయితే, ఈ పనీర్ కోసం కొందరు మార్కెట్లో వేలకు వేలు పెడతారు. ఎందుకంటే, ఇది అంత కాస్టలీ గా ఉంటుంది.

అయితే, మనం కొనే వాటిలో పనీర్ మంచిగా ఉంటుందని నమ్మకం లేదు. అలా అని బయట కనిపించిన వాటిని తెచ్చి చేసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ఇంట్లోనే తయారు చేసుకోండి.

బయటే కాకుండా మీ ఇంట్లోనే ఫ్రెష్ గా పనీర్ తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి, ఆ తర్వాత 1 లీటర్ మిల్క్ ను పోసుకోండి. ఇక ఇప్పుడు పాలను స్టవ్ మీదే పెట్టి మరిగించాలి.

కొద్దీ సేపటి తర్వాత పాలు విరగడానికి వెనిగర్ ను పాలలో వేయాలి. ఆ తర్వాత పాలు మొత్తం విరిగిపోతాయి. అది జున్నులా మారుతుంది. విరిగిన పాలలో నీళ్లు పోసి, ఒక కాటన్ వస్త్రంతో వడకట్టుకోవాలి.

వడకట్టిన తర్వాత అలాగే, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక పనీర్‌ను తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. నాలుగు రోజుల వరకు తాజాదనంగా ఉంటుంది.