
అలాంటి సమయాల్లో చాలా మంది నిద్రపోతుంటారు. అయితే ఇలా చేయకుండా కొంచెం ఓపిక చేసుకుని శరీరానికి శక్తినిచ్చే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే నిద్రపోవడం వల్ల బలహీనత మరింత పెరుగుతుంది.

తయారీ విధానం : ముందుగా పైన చెప్పిన విధంగా ఓట్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ తీసుకొని, స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, 1/2 కప్పు ఓట్స్ వేసి, దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైన్ చేసుకోవాలి. మంచిగా పొడిగా అవుతాయి.

ఆ తర్వాత వేరే పాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, వేడి అయిన తర్వాత జీడిప్పు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఓట్స్ వేసి వేయిస్తూ ఉండాలి. దానిని కలుపుతూనే ఉండాలి. తర్వాత పాలు పోసి మళ్లీ కలపాలి. రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి.

అవి కాస్త చిక్కగా, దగ్గరగా వచ్చినట్లు అవుతుంది. ఆ సమయంలో చక్కెర వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలు మంచిగా కలిపిన తర్వాత అందులో నెయ్యి వేసి మళ్లీ కలపాలి.

ఇలా ఐదు నిమిషాల పాటు, మీడియం మంటపై కలపుతూ ఉండాలి. తర్వాత ఏలకుల పొడి, జీడిప్పు వేసి మళ్లీ బాగా కలపాలి. అంతే వేడి వేడిగా, స్వీట్ స్వీట్‌గా ఓట్స్ హల్వా రెడీ, మరి మీరు కూడా ట్రై చేస్తారా?