ఆంధ్రా స్టైల్లో నేతి బీరకాయ చట్నీ ఇలా చేసుకుని తింటే రుచి అద్భుతం

Updated on: Feb 25, 2026 | 8:55 PM

నేతి బీరకాయలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అయితే, దీనితో కార్తీక మాసంలో పచ్చడిని చేసుకుని తింటారు. టిఫిన్స్ నుంచి రైస్ వరకు ఈ పచ్చడిని తింటుంటారు. ఇది అంత రుచికరంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5

కావల్సిన పదార్ధాలు: నేతి బీరకాయ, 3 టమాటాలు, 5 పచ్చిమిర్చి, చింతపండు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు ,  
వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకును, పోపు గింజలు తీసుకోవాలి.

కావల్సిన పదార్ధాలు: నేతి బీరకాయ, 3 టమాటాలు, 5 పచ్చిమిర్చి, చింతపండు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు , వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకును, పోపు గింజలు తీసుకోవాలి.

2 / 5

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక, కట్ చేసిన పచ్చిమిర్చి, నేతి బీరకాయ ముక్కలు, టమాటాలు,  కొద్దిగా చింతపండు వేసి నూనెలో బాగా వేయించాలి.

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక, కట్ చేసిన పచ్చిమిర్చి, నేతి బీరకాయ ముక్కలు, టమాటాలు, కొద్దిగా చింతపండు వేసి నూనెలో బాగా వేయించాలి.

3 / 5
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని రోటిలో వేసుకుని దానిలో తగినంత ఉప్పు, వెల్లుల్లి వేసి బరకగా రోట్లో దంచుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని రోటిలో వేసుకుని దానిలో తగినంత ఉప్పు, వెల్లుల్లి వేసి బరకగా రోట్లో దంచుకోవాలి.

4 / 5
దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి.

దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి.

5 / 5
అంతే, నేతి బీరకాయ రోటీ చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో తింటే ఇది మరింత రుచికరంగా ఉంటుంది.

అంతే, నేతి బీరకాయ రోటీ చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో తింటే ఇది మరింత రుచికరంగా ఉంటుంది.

Follow Us