
కావాల్సిన పదార్ధాలు: 250 గ్రాముల చేపలు, ఒక కప్పు చింతపండు రసం, రెండ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, మసాలా పొడిని తీసుకోవాలి.

ముందుగా ఒక గిన్నెలో చేప ముక్కలను తీసుకుని ఉప్పు నీటిలో కడిగి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి

చింతపండు రసం పోసిన మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించాలి.

ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, కారం, మసాలా పొడి వేయాలి. శుభ్రం చేసిన చేపల ముక్కలను, చింతపండు రసాన్ని, రుచికి తగినంత ఉప్పు వేసి, మంచి పోసి మూత పెట్టి స్టవ్ మీదే ఉంచండి.

15 నిముషాల పాటు బాగా ఉడికించి మీడియం మంట మీద చేప ముక్కలు పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తినండి.