
చియా గింజలు: పోషకాల గని అయిన చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటుంది. వీటిని నీటిలో లేదా పండ్ల రసాల్లో నానబెట్టి తీసుకోవడం వల్ల పూర్తి ప్రయోజనం ఉంటుంది.

అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలంటే అవిసె గింజలే బెస్ట్ ఛాయిస్. ఇందులోని కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను శరీరం నుండి బయటకు పంపేస్తుంది. అవిసె గింజలను నేరుగా మింగకూడదు. వీటిని దోరగా వేయించి, పొడి చేసుకుని తింటేనే పోషకాలు అందుతాయి.

గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్‌ను పెంచుతుంది. మంచి నిద్రకు ఈ హార్మోన్ చాలా అవసరం. మీరు నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ప్రతిరోజూ గుమ్మడికాయ గింజలను తినడాన్ని పరిగణించండి. గుమ్మడికాయ గింజలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మంచి మూలం. ఈ మూలకాలు ఎముకలను బలోపేతం చేయడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి.

నువ్వులు: నువ్వులలో ఉండే లిగ్నన్లు, ప్లాంట్ స్టెరాల్స్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి. నువ్వులను లడ్డూల రూపంలో లేదా రోజువారీ వంటల్లో పొడి రూపంలో చేర్చుకోవచ్చు.

పొద్దుతిరుగుడు విత్తనాలు: వీటిలో ఉండే ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్‌ను అడ్డుకుంటాయి. అలాగే ఇందులోని విటమిన్-E రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. మందులతో పనిలేకుండా సహజంగా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఈ ఐదు రకాల విత్తనాలు అద్భుతమైన వరం.