నిమ్మరసంలో ఈ ఒక్కటి కలిపి ఉదయాన్నే తాగితే కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే.. మీరు ఊహించని అద్భుతాలు..

Updated on: Jan 27, 2026 | 7:30 PM

చాలామంది బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఉదయం పరగడుపున నిమ్మరసం తాగుతుంటారు. అయితే ఈ డ్రింక్‌కు మరింత శక్తిని ఇచ్చే ఒక అద్భుతమైన చిట్కా ఉంది. అదే చియా సీడ్స్. కప్పు నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టి తాగితే.. అది కేవలం బరువు తగ్గడానికే కాకుండా శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది.

1 / 5
బరువు తగ్గడానికి భేష్‌: చియా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి నీటిని పీల్చుకుని జెల్‌లా తయారవుతాయి. ఉదయాన్నే ఈ డ్రింక్ తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అనవసరమైన ఆకలి బాధలు తగ్గి కేలరీల వినియోగం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మ్యాజిక్ డ్రింక్.

2 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:చియా గింజల్లోని పీచు పదార్థం ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలు తొలగి కడుపు శుభ్రంగా ఉంటుంది.

3 / 5
గుండెకు రక్షణ కవచం: ఈ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్లతో కలిపి వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

4 / 5
షుగర్ లెవల్స్ కంట్రోల్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక గొప్ప వరం. చియా గింజలు రక్తప్రవాహంలోకి చక్కెర విడుదలను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

5 / 5
వ్యాధి నిరోధక శక్తి: నిమ్మకాయలో విటమిన్-సి, చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలను రక్షిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండటమే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.