
మనం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ నిండుది వాడుతున్నప్పుడు మంట రంగు నీలం రంగులో కనిపిస్తుంది. అలాగే, సిలిండర్ ఖాళీగా ఉన్నప్పుడు, ఈ రంగు క్రమంగా పసుపు రంగులోకి మారుతుంది. అంటే ఏ సమయంలోనైనా గ్యాస్ అయిపోతుందని గుర్తించుకోవాలి. దీంతో మనకు సప్లై చేసిన గ్యాస్ సిలిండర్ నిండుగా వచ్చిందా..? లేదంటే సగం వరకు మాత్రమే ఫిల్ చేశారా అనేది తెలుసుకోవచ్చు.

ఇలా కాకుండా మీరు ఇంకా సింపుల్‌గానే గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ నిండి ఉందో తెలుసుకోవాలంటే... మీరు ఒక తడి గుడ్డను తీసుకోవాలి. దాంతో గ్యాస్ సిలిండర్‌ను పూర్తిగా తుడవాలి. ఎలాగంటే.. దానిపై దుమ్ము పేరుకుపోయి ఉన్నట్టయితే, ఎలా క్లీన్ చేస్తామో అలా తుడవాలి. అప్పుడు 2-3 నిమిషాల తర్వాత సిలిండర్‌పై అక్కడక్కడ తడి ఆరిపోతూ ఉంటుంది.

కాని, కొన్ని చోట్ల మాత్రం తడి ఇంకా నెమ్మదిగా పోతుంది. నెమ్మదిగా తడి ఆరిపోతూ ఉంటే అంత వరకు గ్యాస్ ఉందని అంచనాకు రావొచ్చు. తడి త్వరగా ఆరిపోతే అక్కడ గ్యాస్ లేదని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు సగం సిలిండర్‌కే గ్యాస్ ఉంటే.. అప్పుడు సగం తడి భాగం త్వరగా ఆరిపోతుంది. మిగతా సగం నెమ్మదిగా ఆరుతుంది.

Gas Cylinder

ఆ తర్వాత సిలిండర్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. ఇలా చేయడం వల్ల సిలిండర్‌లో కొంత భాగం పొడిగా కనిపిస్తుంది. కొన్ని భాగాలు ఇప్పటికీ తేమగా ఉండటం చూస్తారు. అందువలన సిలిండర్ ఖాళీ భాగం ఎండిపోవడం ప్రారంభమవుతుంది. తడిసిన స్థలం ద్వారా సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు.