నిమ్మరసం: మోచేతిపై నిమ్మరసం రాసి ఒకటి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. నిమ్మరసంలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంద. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
పెరుగు, ఉప్పు: ఒక చిన్న గిన్నెలో పెరుగు, ఉప్పు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మోచేతులపై అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. నలుపును తొలగిస్తుంది.
అలోవెరా జెల్: తాజా కలబంద ఆకును కట్ చేసి, దాని జెల్‌ను తీసి మోచేయిపై రాయండి. 20-30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగడం వల్ల చర్మానికి తాజాదనం, మెరుపు వస్తుంది.
క్రీమ్, పసుపు: క్రీమ్‌లో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసి మోచేతులపై రాయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. పసుపు చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది. క్రీమ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
శనగ పిండి, పాలు: శనగపిండిలో కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా చేసి మోచేతికి పట్టించాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మ ఛాయను క్లియర్ చేస్తుంది. నలుపును తొలగిస్తుంది. ఈ ఇంటి నివారణలను ఉపయోగించే ముందు మీకు అలెర్జీ సమస్యలు ఉంటే, వాటిని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించండి.