AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tooth Brush: టూత్ బ్రష్ ఎన్ని నెలలకు మార్చాలంటే..? లైట్ తీసుకుంటే పళ్ల పని అయిపోయినట్లే..

చాలామంది నెలల పాటు టూత్ బ్రెష్ వాడుతుంటారు. కానీ అలా వాడకూడదు. దానివల్ల దంతాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రష్ బ్రిస్టల్స్ అరిగిపోవడంతో పాటు బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి మరి టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు మార్చాలి..? ఎలాంటి బ్రష్ వాడాలి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Oct 10, 2025 | 7:37 AM

Share
ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందులో దంతాల ఆరోగ్యం చాలా ముఖ్యం. మనం రోజూ టూత్ బ్రష్ వాడతాం, కానీ దాన్ని ఎప్పుడు మార్చాలో చాలా మందికి తెలియదు. పాత బ్రష్‌ను వాడితే నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది, అలాగే బ్యాక్టీరియా కూడా వ్యాపిస్తుంది.

1 / 5
ఎన్ని రోజులకు మార్చాలి..? : ప్రతి ఒక్కరూ తమ టూత్ బ్రష్‌ను ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి తప్పకుండా మార్చుకోవాలి. ఒకే బ్రష్‌ను చాలా నెలలు వాడితే అందులో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. బ్రష్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా మళ్లీ నోట్లోకి వెళ్లి హాని చేస్తుంది. బ్రష్‌లోని ముళ్ళగరికెలు త్వరగా పాడైపోతే లేదా విరిగిపోతే, వెంటనే కొత్త బ్రష్ తీసుకోవాలి. పాత బ్రష్ వాడటం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి.

2 / 5
ఎలాంటి బ్రష్ వాడాలి?: సున్నితమైన చిగుళ్లు ఉన్నవారు ఎల్లప్పుడూమృ సాఫ్ట్ టూత్ బ్రష్‌నే ఉపయోగించాలి. నోటి ఆరోగ్యం బాగా ఉంటే, మీడియం టూత్ బ్రష్‌ను వాడవచ్చు.

3 / 5
బ్రషింగ్ విధానం: మీ టూత్ బ్రష్ ముళ్ళగరికెలు త్వరగా పాడవుతుంటే, మీరు బ్రష్ చేసే విధానం సరైంది కాదని అర్థం చేసుకోవాలి. గట్టిగా బ్రష్ చేయడం వల్ల చిగుళ్లు, దంతాలు దెబ్బతింటాయి.దంతవైద్యుల ప్రకారం,, దంతాల ప్రతి మూలకూ బ్రష్ అందేలా సరైన పద్ధతిలో బ్రష్ చేయాలి. ఇలా చేస్తేనే దంతాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
దంతాల ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి సంబంధించినది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండుసార్లు బ్రష్ చేయడం, సరైన సమయంలో టూత్ బ్రష్‌ను మార్చడం చాలా ముఖ్యం. దంతాలలో ఏ సమస్య వచ్చినా వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

5 / 5