Subhash Goud |
Oct 02, 2022 | 6:22 PM
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో శాకాహారులు ఉన్న దేశం భారతదేశం. శాకాహారుల ప్రపంచ ర్యాంకింగ్‌లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. హర్యానా, రాజస్థాన్ లు అత్యధిక సంఖ్యలో శాకాహారులు నివసించే రాష్ట్రాలు. దేశంలో అత్యధిక శాఖాహారులు, మాంసాహారులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి.
UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. టాప్-10 శాఖాహార దేశాల జాబితాలో మెక్సికో తర్వాత భారతదేశం ఉంది. ఇక్కడ 19 శాతం మంది శాకాహారులున్నారు.
నాన్ వెజ్ తినడంలో భారతీయ మహిళలు వెనుకంజ వేయలేదు. దేశంలో ప్రతి 4 మందిలో 3 మంది మహిళలు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. వారిలో ఎక్కువ మంది తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
దేశంలో అత్యధిక శాకాహారులు ఉత్తర, మధ్య భారతదేశంలో ఉన్నారు. అలాగే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఉత్తర, మధ్య భారతదేశంలో అత్యధిక శాఖాహారులు ఉన్నారు.
తూర్పు రాష్ట్రాల్లో 90 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. వీటిలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.