4 / 5
20-30 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి నేచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. కావాలంటే పంచదారను తేనెతో కలిపి స్క్రబ్ లా వేసుకోవచ్చు. దీని కోసం కొద్దిగా తేనె తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా పట్టించాలి. కాసేపు మసాజ్ చేసుకోవాలి. దీన్ని చర్మంపై 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత కడిగేయాలి. అయితే దీనిని ప్రతిరోజూ చేయకూడదు.