
Blood Pressure 1

కానీ పరీక్షల చేయించుకున్న తర్వాత గానీ చాలా మందికి శరీరంలో అధిక రక్తపోటు ఉన్నట్లు అర్థమవుతుంది. నిజానికి మైకము, భయము, చెమట, నిద్రలేమి అధిక రక్తపోటు వంటి ప్రారంభ లక్షణాలు ద్వారా అధిక రక్తపోటును గుర్తించవచ్చంటున్నారు నిపుణులు.

కానీ ఈ లక్షణాలు చాలా సాధారణం. వీటి ద్వారా మాత్రమే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా లేదా అని నిర్ధారించడం సాధ్యం కాదు. 'అమెరికన్ హార్ట్ అసోసియేషన్' ప్రకారం.. కళ్లు ఎరుపు రంగులోకి మారడం, కనుగుడ్డుపై ఎర్రటి రక్తపు ఛాయలు కనిపించడాన్ని సబ్‌కంజంక్టివల్ హెమరేజ్ అని పిలుస్తారు. ఇది అధిక రక్తపోటు హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి.

కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ రోగుల కంటి రంగు కూడా కొన్నిసార్లు ఎరుపు రంగులో ఉంటుంది. ఇవే లక్షణాలు అధిక రక్తపోటు ఉన్న రోగులలో కూడా కనిపిస్తాయి. ఫలితంగా, ఇది రెండు వ్యాధుల సాధారణ లక్షణంగా పరిగణిస్తుంటారు.

ముఖం ఎర్రబడటం, ఎరుపు కళ్ళు అధిక రక్తపోటు ప్రారంభ సంకేతాలు. ముఖంలోని రక్తనాళాలు పల్చగా మారినప్పుడు ముఖం ఎర్రబారడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.