High Blood Pressure Diet: రక్తపోటు అదుపులో ఉండాలంటే మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి

|

Jun 28, 2024 | 8:43 PM

అధిక బరువు ఉన్నవారు సులువుగా అధిక రక్తపోటు బారిన పడతారనేది అపోహ మాత్రమే. ఎందుకంటే నేటి కాలంలో సన్నగా ఉండి సాధారణ శరీర బరువుతో ఉన్నవారు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో వృద్ధులే కాదు యువకులు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనికి గల ఒకేఒకకారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమరహితమైన జీవనశైలి..

1 / 5
అధిక బరువు ఉన్నవారు సులువుగా అధిక రక్తపోటు బారిన పడతారనేది అపోహ మాత్రమే. ఎందుకంటే నేటి కాలంలో సన్నగా ఉండి సాధారణ శరీర బరువుతో ఉన్నవారు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో వృద్ధులే కాదు యువకులు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనికి గల ఒకేఒకకారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమరహితమైన జీవనశైలి.

2 / 5
అధిక రక్తపోటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందువల్ల, అధిక రక్తపోటు ఉన్నవారు క్రమరహిత జీవనశైలిని నివారించడం చాలా అవసరం. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు వారి ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రోజువారీ ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలకూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అందువల్ల, అధిక రక్తపోటు ఉన్నవారు రోజువారీ ఆహారంలో పాలకూరను చేర్చుకోవాలి.

4 / 5
అరటిపండులో ఉండే మినరల్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

5 / 5
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్‌కు సాటి మరేదీ లేదు. అందులోనూ పిస్తా పప్పులు రక్తపోటును అదుపులో ఉంచడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అదికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.