బాడీ మొత్తాన్ని క్షణాల్లో కూల్ చేసే గిరిజనుల వంటకం.. అడవిలోని అడ్డపిక్కల నంజుతో కొండకొర్రల జావ

Updated on: May 15, 2026 | 8:45 AM

అడవుల్లో నివాసం ఉంటున్న గిరిజనుల అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. ఇంకా వారు ఆహారపు అలవాట్లు అయితే చాలా వేరుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి ఇప్పటికీ చాలామందికి తెలియవు. వారు కేవలం ప్రకృతి ప్రసాదించిన వాటితోనే ఆరోగ్యకరమైన వంటలు చేసుకుని తింటారు. ఇదే వారి ప్రత్యేకత అందుకే గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు

1 / 5

అడవుల్లో నివాసం ఉంటున్న గిరిజనుల అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. ఇంకా వారు ఆహారపు అలవాట్లు అయితే చాలా వేరుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి ఇప్పటికీ చాలామందికి తెలియవు. వారు కేవలం ప్రకృతి ప్రసాదించిన  వాటితోనే 
ఆరోగ్యకరమైన వంటలు చేసుకుని తింటారు. ఇదే వారి ప్రత్యేకత అందుకే గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు

అడవుల్లో నివాసం ఉంటున్న గిరిజనుల అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. ఇంకా వారు ఆహారపు అలవాట్లు అయితే చాలా వేరుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి ఇప్పటికీ చాలామందికి తెలియవు. వారు కేవలం ప్రకృతి ప్రసాదించిన వాటితోనే ఆరోగ్యకరమైన వంటలు చేసుకుని తింటారు. ఇదే వారి ప్రత్యేకత అందుకే గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు

2 / 5
అలాంటి వంటకాలలో అడ్డపిక్కల నంజుతో చేసే కొండకొర్రల జావ కూడా ఒకటి. అడవిలో దొరికే ఆకులు, వేరుశెనగల వలే ఉన్న ఈ 
నేచురల్ పదార్థాలు, కొండకొర్రలతో మిక్స్ చేసి జావను తయారు చేస్తారు. ఇది శరీరానికి చాలా మంచిది ముఖ్యంగా బాడీ మొత్తాన్ని కూల్ చేస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని గిరిజనులు చెబుతున్నారు. సమ్మర్లో వాళ్ళు  ఈ జావను తాగుతారు.

అలాంటి వంటకాలలో అడ్డపిక్కల నంజుతో చేసే కొండకొర్రల జావ కూడా ఒకటి. అడవిలో దొరికే ఆకులు, వేరుశెనగల వలే ఉన్న ఈ నేచురల్ పదార్థాలు, కొండకొర్రలతో మిక్స్ చేసి జావను తయారు చేస్తారు. ఇది శరీరానికి చాలా మంచిది ముఖ్యంగా బాడీ మొత్తాన్ని కూల్ చేస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని గిరిజనులు చెబుతున్నారు. సమ్మర్లో వాళ్ళు ఈ జావను తాగుతారు.

3 / 5
కొండకొర్రల జావకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కొండకొర్రలు , అర కప్పు అడ్డపిక్కల నంజు , కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 
మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు , నీళ్లు 4 నుంచి 5 కప్పులు,  ఒక కప్పు మజ్జిగ లేదా పెరుగును తీసుకుంటే సరిపోతోంది. మంచి పెరుగును తీసుకుంటే మంచిది.

కొండకొర్రల జావకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కొండకొర్రలు , అర కప్పు అడ్డపిక్కల నంజు , కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు , నీళ్లు 4 నుంచి 5 కప్పులు, ఒక కప్పు మజ్జిగ లేదా పెరుగును తీసుకుంటే సరిపోతోంది. మంచి పెరుగును తీసుకుంటే మంచిది.

4 / 5

ముందుగా కొండకొర్రలను తీసుకుని కడిగి  నానబెట్టాలి. ఆ తర్వాత వాటిలో ఉన్న నీరు వంపేసి మిక్సీలో పట్టుకోవాలి. ఇక అదే సమయంలో అడ్డపిక్కల నంజును కూడా క్లీన్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఆ తరవాత ఒక గిన్నెలో నీరు పోసి వాటిని బాగా మరిగించాలి. ఇంకా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి.

5 / 5

ఇక మరుగుతున్న నీటిలో కొండకొర్ర రవ్వను వేసి కలపాలి. లేకపోతే ఉండలుగా అవుతుంది. బాగా ఉడికిన తర్వాత అడ్డపిక్కల నంజు వేసి 20 నిముషాల పాటు పొయ్యి మీదే ఉంచి మగ్గించాలి.  ఇక చివర్లో ఉప్పు కూడా వేసి దింపేయాలి. ఇంకా దీనిని వేడిగా కూడా  తాగొచ్చు. అయితే, కొద్దీ సేపు చల్లారనిచ్చి  ఒక గ్లాస్ మజ్జిగ కలిపి తీసుకుంటే  రుచిగా ఉంటుంది.

Follow Us