Kitchen Hacks: ఇలా క్లీన్ చేస్తే వాటర్ బాటిల్స్ లోపలి నుంచి కూడా శుభ్రపడతాయి..

ప్రతి రోజూ ఉపయోగించే వస్తువుల్లో వాటర్ బాటిల్స్ కూడా ఒకటి. చాలా మంది ఆఫీసులకు, స్కూళ్లకు, బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తారు. కానీ వీటిని కేవలం బయట నుంచి మాత్రమే క్లీన్ చేస్తారు. కానీ లోపల నుంచి క్లీన్ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. లోపలి నుంచి వాటర్ బాటిల్స్ ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

Chinni Enni

|

Updated on: Nov 01, 2024 | 4:51 PM

నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాడీ త్వరగా డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇంట్లో ఉంటే సరే.. కానీ ఆఫీసులకు, బయటకు వెళ్లినప్పుడు వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తారు.

1 / 5
వాటర్ బాటిల్స్ ఉపయోగించడం మంచిదే. కానీ వీటిని క్లీన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రతి రోజూ వాటర్ బాటిల్స్ బయట మాత్రమే కాకుండా లోపల కూడా క్లీన్ చేయాలి. లేదంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల పలు రోగాలు రావచ్చు.

2 / 5
వాటర్ బాటిల్స్‌ను లోపలి నుంచి క్లీన్ చేయడం కాస్త కష్టమే. కానీ ఈజీగా చేయవచ్చు. కొద్దిగా గోరు వెచ్చటి వేడి నీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి వాటర్ వాటిల్స్‌లో వేసి కనీసం 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత క్లీన్ చేస్తే సరి.

3 / 5
వేడి నీళ్లు, వేనిగర్‌తో కూడా బాటిల్స్‌‌ను లోపలి నుంచి శుభ్రం చేయవచ్చు. వేడి నీళ్లు వేసి అందులో కొద్దిగా వెనిగర్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఓ పది నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి.

4 / 5
అదే విధంగా బేకింగ్ సోడా, నిమ్మరసంతో కూడా ఈజీగా వాటర్ బాటిల్స్ క్లీన్ చేయవచ్చు. నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. ఇప్పుడు బాటిల్స్‌లోకి గోరు వెచ్చటి నీళ్లు వేసి.. అందులో ఈ లిక్విడ్ వేయాలి. ఆ తర్వాత బాగా గిలక్కొటి.. సాధారణ నీటితో కడిగేస్తే సరిపోతుంది.

5 / 5
Follow us