వింటర్ సీజన్ వచ్చిందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఇబ్బంది పడే సమస్యల్లో డ్రై స్కిన్ కూడా ఒకటి. చర్మం అంతా పొలుసులుగా ఊడి వస్తూ చాలా చికాకును తెప్పిస్తుంది. స్కిన్ డ్రై అయిపోయి.. దురద పెడుతూ ఉంటుంది. చర్మం తెల్లగా కూడా కనిపిస్తుంది.
పెదాలు కూడా పగిలిపోతూ ఉంటాయి. చర్మం తేమను కోల్పోయినప్పుడు డ్రై అయిపోతుంది. దీంతో బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చర్మం డ్రైగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో నీటిని తక్కువగా తాగడం కూడా ఒకటి.
శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా చర్మం పొడిగా మారుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో నీటిని ఎక్కువగా తీసుకోవాలి. డ్రై స్కిన్‌తో బాధ పడేవారు ఈ ఆయిల్స్‌తో రోజూ మసాజ్ చేసుకుంటే ఈ సమస్య నుంచి రెండు, మూడు రోజుల్లోనే బయట పడతారు.
కొబ్బరి నూనె మన అందరి ఇళ్లలో ఉంటుంది. స్నానం చేసే అరగంట ముందు కొద్దిగా ఆయిల్ వేడి చేసి.. శరీరం అంతా మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల శరీరానికి తేమ అందుతుంది. అలాగే ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, బాదం నూనె, ఆవ నూనె రాసుకున్నా మంచిదే.
అదే విధంగా డ్రై స్కిన్‌తో బాధ పడేవారు.. పచ్చి పాలు తీసుకుని అందులో కాటన్ ముంచి చర్మానికి రాస్తూ ఉండండి. ఇలా రెండు, మూడు రోజులు చేయగానే చర్మంలో మంచి మార్పులు వస్తుంది. తేనె, నెయ్యి, మీగడ రాసుకున్నా చర్మం తేమగా మారుతుంది.