
శీతాకాలం మొదలైంది. నవంబర్ నెలలోనే చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే సీజన్‌లో చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. ముఖం, చేతులు, లిప్స్ పగిలిపోయి, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటరు. అయితే ఇలా ముఖం పగలకుండా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట.

చాలా మంది చలికాలంలో మాయిశ్చరైజర్ వాడటంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ శీతాకాలంలో ప్రతి రోజూ తప్పకుండా వాడాలి. స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన చర్మం పొడిబారకుండా ఉంటుందంట.

చాలా మంది చలి ఎక్కువగా ఉందని, చాలా వేడి నీటితో స్నానం చేస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయకూడదంట. దీని వలన స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అందువలన గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

శీతాకాలం వస్తే చాలు , వాతావరణం చాలా తేమగా ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ దాహం కూడా వేయదు. దీంతో చాలా మంది ఎక్కువ నీళ్లు తాగడానికి ఇష్టపడరు. కానీ ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి సరిపడినంత నీరు తాగాలి. ఇలా ప్రతి రోజూ నీరు తాగడం వలన శరీరం డీహైడ్రేషన్ అవ్వదు, దీంతో చర్మం పొడిబారడం, ముఖం పగలడం వంటి సమస్యలు తగ్గిపోతాయంట.

అదే విధంగా చలికాలంలో ముఖం అందంగా మెరిసిపోవాలి అంటే, తప్పకుండా ఈ సమయంలో కొబ్బరి నీరు, నారింజ, పుచ్చకాయ, జామ పండు జ్యూస్‌లు తాగాలంట. అలాగే ఓట్స్ బాదం, ఆక్రోట్ వంటివి మీ డైట్‌లో చేర్చుకోవడం వలన చలికాలంలో మీ ముఖం అందంగా, నిగారిపుంగా ఉంటుందంట.