
కావాల్సిన పదార్థాలు : పచ్చి బొప్పాయి1, ధనియాలు రెండు టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు వన్ టీస్పూన్, వాము 1టీస్పూన్, మెంతులు వన్ టీస్పూన్, ఆవాలు 3 టీ స్పూన్స్, ఎండు మిర్చి నాలుగు, ఆవ నూనె కప్పున్నర, నల్ల జీలకర్ర వన్ టీస్పూన్ , కారం వన్ టీ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 50 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడ, వెనిగర్ చిటికెడు, ఇంగువల చిటికెడు.

ముందుగా బొప్పాయిని తీసుకొని దానిని శుభ్రం చేసి, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత బొప్పాయిని సగం కోసి, అందులోని గింజలను వేరు చేసి, అచ్చం మామిడి కాయ ఊరగాయ పచ్చి పెట్టుకునే సమయంలో ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోవలి. పై తొక్క లేకుండా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.

తర్వాత పెద్ద పాత్ర తీసుకొని అందులో కొన్ని నీటిని మరిగించి ఈ కట్ చేసిన బొప్పాయి ముక్కలు వేసుకోవాలి, అవి ఉడికిన తర్వాత వీటిని దాదాపు నాలుగు గంటలు ఆరబెట్టాలి. తడి లేకుండా మంచిగా ఆరిన తర్వాత ఊరగాయ పచ్చడి పెట్టుకోవడానికి పోపు సిద్ధం చేసుకోవాలి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై పెనం పెట్టుకొని , సోంపు, జీలకర్ర, వాము, మెంతులు, ఆవాలు, ధనియాలు అన్ని వేసి వేయించి, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆవ నూనె వేసి, వేడి అయిన తర్వాత చిటికెడు పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, వాము వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

దీని తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న బొప్పాయి ముక్కలను ఒక బౌల్‌లో తీసుకొని అందులో మనం పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత ఆవ నూనె మిశ్రమం వేయాలి. తర్వాత కారం, తగినంత ఉప్పు, కొంచెం వెనిగర్ వేసి పక్కన పెట్టుకోవాలి. దీనిని ఒక 5 రోజులు గాజు సీసలో భద్రపరిచి పెట్టుకోవాలి. తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ వేరే లెవల్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి.