కంటినిండా నిద్ర అవసరం.. నిమిషాల్లో నిద్రలోకి జారుకోవాలా? ఈ చిట్కాలు పాటించండి

|

Aug 29, 2024 | 8:21 AM

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో మన శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో మనలో కొత్త ఉత్సాహం నిండుతుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా మనం చేసే పనిమీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు ఇలా చాలా అంశాలు నిద్రను దూరం చేస్తున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పడుకోగానే నిమిషాల్లో నిద్ర వస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

1 / 5
రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకే రకమైన పనులు అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, మంచి మ్యూజిక్‌ వినటం వంటివి చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. అంతేగానీ,టీవీ, కంప్యూటర్‌ మొబైల్‌ ఫోన్‌ వాడితే నష్టం కలుగుతుంది. పడుకునే ముందు మొబైల్ ఫోన్‌ను దూరంగా పెట్టుకోవటం మంచిది. ఫోన్‌ వాడితే.. ఇది మీ నిద్రను చెడగొడుతుంది. అందువల్ల పడుకునే సమయంలో ఫోన్‌ చూడటం మానేయాలంటున్నారు నిపుణులు.

2 / 5
Dream

Dream

3 / 5
మద్యం తాగడం, స్మోకింగ్ వంటి అలవాట్ల కారణంగా కూడా సరైన నిద్ర ఉండదు. ఇవి నిద్రపై నెగిటివ్ ప్రభావం చూపుతాయి. తాగిన వెంటనే నిద్ర వస్తుంది. కానీ మత్తు దిగాక మెలకువ వచ్చి నిద్రపట్టదు. అలాగే, పడుకునే ముందు మితంగా, సమతుల్య ఆహారం తీసుకోవాలి. గోధుమ పాస్తా, ఓట్ మీల్, పాల ఉత్పత్తులు, హెర్బల్ టీ తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. కానీ, పడుకునే ముందు టీ, కాఫీలు తాగొద్దు.

4 / 5
గది వాతావరణంమీ పడక గది వాతావరణం కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. గది మరీ చల్లగా, వేడిగా లేకుండా ఉండాలి. వేడిగా ఉన్నా లేక చల్లగా ఉన్నా నిద్ర సరిగా పట్టదు. అలాగే, బెడ్‌రూమ్ ఎంత నిశబ్ధంగా ఉంటే అంత మంచి నిద్ర వస్తుంది. కాబట్టి గది నిశబ్ధంగా ఉండేలా చూసుకోండి ఎటువంటి సౌండ్స్ మీ నిద్రకు ఆటంకం కలిగించకుండా ఉండాలి.

5 / 5
మంచి నిద్రకు మనం పడుకునే బెడ్ రకం​కూడా ప్రభావం చూపుతుంది. మీకు మంచి నిద్ర పట్టాలంటే అనువైన బెడ్ ఎంచుకోవడం తప్పనిసరి. మీరు వాడే పరుపు, దిండ్లు సౌకర్యవంతంగా లేకపోతే నిద్రసరిగా పట్టదు. మీకు అనుగుణంగా ఉండే పరుపు, దిండ్లు వాడడం మంచిది.