Heart Diseases: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టే.. అవేంటో ముందు తెలుసుకోండి..

|

Mar 22, 2022 | 6:27 PM

Heart Diseases Symptoms : జీవనశైలి, ఆహారం కారణంగా పలు రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీటిలో గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తే.. ముందు అలెర్ట్ కావాలని వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 6
దగ్గు: దగ్గు చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నా.. ఔషధాలు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనం కలగకపోతే దానిని నిర్లక్ష్యం చేయకండి. ఇది గుండె సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు.

2 / 6
ఛాతీ నొప్పి: ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం కూడా గుండె జబ్బు లక్షణంగా పరిగణిస్తారు. ఛాతీ నొప్పి సమయంలో గుండెపోటు కూడా వచ్చే అవకాశముంది. మీరు తరచుగా అసౌకర్యంగా భావిస్తే వెంటనే చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది.

3 / 6
చేయి నొప్పి: శరీరంలోని ఎడమ చేయి నొప్పి, చేయి లాగడం వంటివి కూడా మీ గుండె అనారోగ్యానికి సంబంధించిన లక్షణమే. కావున ఎడమ చేయి నొప్పి ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది. ఇది గుండె జబ్బు లక్షణం కావచ్చు.

4 / 6
అలసట: మీరు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే మీరు తరచుగా అలసిపోతారు. తగినంత నిద్ర పోయినప్పటికీ అలాంటివారు తరుచుగా అలసిపోతారు. అలాంటి వారు వైద్యుడిని సంప్రదించాలి.

5 / 6
తలతిరగడం: ఇతర కారణాల వల్ల కూడా కళ్లు తిరగుతాయి. గుండె అనారోగ్యంగా ఉంటే ఈ సమస్య మీకు తరచుగా కనిపిస్తుంది. తలతిరగడం, మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే కచ్చితంగా గుండె నిపుణుడిని సంప్రదించాలి.

6 / 6