
ఈ రోజుల్లో గుండెపోటు సమస్య చాలా సాధారణం అయిపోయింది. గుండెపోటుకు వయోపరిమితి లేకుండా పోయింది. దీంతో ఏ వయసు వారైనా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గుండెపోటు ఎంత ప్రాణాంతక వ్యాధి. దీని వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది.

గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి చాలా సాధారణం. కానీ ఛాతీ నొప్పి కాకుండా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చేతుల్లో నొప్పి, దంతాలు, చిగుళ్లలో నొప్పి, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. దంతాలు, చిగుళ్ళలో పేరుకుపోయిన మురికి గుండె సిరల్లో చేరుతుంది. దీని కారణంగా సిరల్లో రక్త ప్రసరణకు అడ్డుపడే ప్రమాదం పెరుగుతుంది. అందుకే పంటి నొప్పి, చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటి లక్షణాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

పంటి నొప్పి తీవ్రతరం అవడంతోపాటు పంటి నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపుపాతోపాటు అధిక చెమట గుండెపోటుకు సంబంధించిన సంకేతాలు. కాబట్టి మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.