Hearing Problem: రోజురోజుకు మీలో వినికిడి శక్తి తగ్గుతుందా.. నష్ట నివారణకు ఏ చర్యలు తీసుకోవాలంటే
వినికిడి లోపం కొందరికి పుట్టినప్పటి నుంచి ఉండవచ్చు.. లేదా కాలక్రమంలో ఎప్పుడైనా వినికిడి సమస్య బారిన పడవచ్చు. వినికిడి సమస్యనే వాడుక బాషలో చెముడు అని అంటారు. ఈ వినికిడి లోపం వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు, లక్షణాలు, వాటి ప్రభావాలు కూడా మారతాయి. ఇక మన దేశంలో 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆరుగురిలో ఒకరికి వినికిడి లోపం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వయసు రీత్యా మన వినికిడి శక్తి తగ్గిపోతుండడమే కాదు.. వినికిడి సమస్యకు మరొక ప్రధాన కారణం ఎక్కువ సేపు పెద్ద పెద్ద శబ్దాలను వినడం.. అవును మీకు రోజురోజుకు వినికిడి శక్తి తగ్గుతుందా.. ఏమి చేయాలంటే..