Healthy Breakfast: చిటికెలో తయారు చేసుకునే బ్రేక్‌ ఫాస్ట్స్‌ ఇవే.. బరువు కూడా సులువుగా తగ్గొచ్చు

|

Sep 03, 2024 | 8:25 PM

రోజువారీ ఆఫీస్ పని ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇంట్లో వేళకు బ్రేక్‌ ఫాస్ట్ తయారు చేసుకోవడం కుదరదు. దీంతో ఉదయం ఆఫీస్‌కు బయల్దేరే సమయంలో హడావిడిగా ఏదో ఒకటి తినేసి పరుగులు తీస్తుంటారు. ఇలా ఉపాధి కారణంగా నగరాల్లో నివసించే వారికి పని ఒత్తిడిలో వంట చేయడం, తినడం, త్రాగడంపై పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఇక వ్యాయామం సంగతి సరేసరి. సమయం లేకపోవడంతో చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆఫీసుకు..

1 / 5
రోజువారీ ఆఫీస్ పని ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇంట్లో వేళకు బ్రేక్‌ ఫాస్ట్ తయారు చేసుకోవడం కుదరదు. దీంతో ఉదయం ఆఫీస్‌కు బయల్దేరే సమయంలో హడావిడిగా ఏదో ఒకటి తినేసి పరుగులు తీస్తుంటారు.  ఇలా ఉపాధి కారణంగా నగరాల్లో నివసించే వారికి పని ఒత్తిడిలో వంట చేయడం, తినడం, త్రాగడంపై పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఇక వ్యాయామం సంగతి సరేసరి. సమయం లేకపోవడంతో చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆఫీసుకు వెళ్లిపోతుంటారు. బరువు తగ్గేందుకు డైట్ ఫాలో అయ్యే వారు ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్ అస్సలు మానేయకూడదు. ఈ కింది ఆరోగ్యకరమైన ఆహారాలను త్వరగా తయారు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

2 / 5
మసాలా వోట్స్ - వోట్స్‌లో ప్రోటీన్, ఫైబర్, వివిధ ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తింటే పొట్ట కూడా నిండుతుంది. మీకు సమయం లేకపోతే, పాలతో ఓట్స్ తినవచ్చు లేదా క్యారెట్, బీన్స్, బీట్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, మిరపకాయలతో వెజిటబుల్ ఓట్స్ చిటికెలో తయారు చేసుకోవచ్చు.

3 / 5
ముంగ్ దాల్ చిలా - పెసర పప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన పెసర్లలో తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. లైట్ ఆయిల్ బ్రష్ చేసి అట్లు మాదిరి వేసుకుంటే రుచి బలేగా ఉంటుంది.

4 / 5
చిర్ పోలా - ఇది ఉదయం చిరుతిండి లేదా తేలికపాటి మధ్యాహ్నం అల్పాహారంగా తీసుకోవచ్చు.  ఈ చిర్ పోలా కూడా రుచిగా ఉంటుంది. బాణలిలో ఆవాలు, కరివేపాకు, బాదంపప్పు వేసి వేయించి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తరగాలి. ఉప్పు, పసుపు, పంచదార, నిమ్మరసం వేసి, చివర్లో అటుకులు వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరి.

5 / 5
ఇడ్లీ - ఈ దక్షిణాది వంటకం ఎంత ఆరోగ్యకరమో అంతే రుచిగా ఉంటుంది. ఇడ్లీలను ఆవిరిపై వండుతారు. ఇడ్లీ తయారీ దాదాపు అందరికీ తెలిసిందే. ఈ ఆహారం త్వరగా కొవ్వును తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.