
కొన్ని రకాల పండ్లు ఆయా సీజన్లలోనే దొరుకుతాయి. ప్రత్యేకించి వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం తప్పకుండా తీసుకోవల్సిందే. వేసవిలో దొరికే పండ్లలో ముఖ్యమైనది తర్బూజా. పోషకాల గనిగా పేర్కొనే ఈ పండును సమ్మర్‌లో కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

శరీరంలో నీటి స్థాయులను పెంచడమేకాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

ఫైబర్ మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలు, అలసట, రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Muskmelon

తర్బూజాలో విటమిన్-ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేసి, కంటి చూపు సామర్థ్యాన్ని పెంచుతుంది. చర్మ సంబంధ సమస్యలు దూరం చేస్తుంది. అలాగే అధిక బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది.