Almonds for Skin and Hair: రోజూ పరగడుపున 4-6 నానబెట్టిన బాదం పలుకులు తిన్నారంటే..
బరువు తగ్గడం నుంచి మెరిసే చర్మం వరకు బాదంలోని పోషకాలు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వెంట్రుకల సంరక్షణలో కూడా బాదం నూనె ఉపయోగిస్తారు. చాలా మంది ఆరోగ్యకరమైన జీవనం కోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదంపప్పు తింటుంటారు. రోజూ 4-6 నానబెట్టిన బాదంపప్పులను తింటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సైతం అంటున్నారు..