Health Tips: పచ్చి కూరగాయలు, పండ్లపై ‘ఉప్పు’ నేరుగా వేసుకుంటున్నారా? దిమ్మతిరిగే నిజాలివి..!

|

Aug 30, 2022 | 10:09 PM

Health tips: చాలా మంది పచ్చి కూరగాయలపై ‘ఉప్పు’ వేసుకుని తింటుంటారు. అలాగే సలాడ్‌ పైనా సాల్ట్ వేసుకుని తింటుంటారు. చాలామందికి ఇది పెద్ద అలవాటు.

1 / 6
Health tips: చాలా మంది పచ్చి కూరగాయలపై ‘ఉప్పు’ వేసుకుని తింటుంటారు. అలాగే సలాడ్‌ పైనా సాల్ట్ వేసుకుని తింటుంటారు. చాలామందికి ఇది పెద్ద అలవాటు. ఇలాగే తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, ఈ అలవాటు వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక ఉప్పు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

2 / 6
సాధారణంగానే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అధిక రక్తపోటు వల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి. 'యూరోపియన్ హార్ట్ జర్నల్'లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మరణాల ప్రమాదం 24 శాతం వరకు పెరుగుతుంది.

3 / 6
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. కానీ చాలా మంది రోజువారీ ఆహారంలో 11 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటు అధిక రక్తపోటుతో పాటు స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

4 / 6
నిజానికి, ఉప్పులో సోడియం ఉంటుంది. ఈ సోడియం శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. ఈ కారణంగా, చాలా మంది తక్కువ సోడియం ఉప్పును ఎంచుకుంటారు. అయితే తక్కువ సోడియం ఉప్పు శరీరానికి నిజంగా మంచిదేనా? అనేది కూడా ఒక సందేహం ఉంది.

5 / 6
సోడియం తక్కువగా ఉండే ఉప్పు ఆరోగ్యానికి ఏ విధంగానూ ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది కానీ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు.

6 / 6
సోడియం, పొటాషియం అసమతుల్యత శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఈ మినరల్స్ సరైన మోతాదులో ఉండటం ముఖ్యం. ఇక్కడ ఏకైక మార్గం ఆహారంలో తక్కువ మొత్తంలో ఉప్పును ఉపయోగించడమేనని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేస్తే వ్యాధుల ప్రమాదాన్ని నివారించొచ్చని చెబుతున్నారు.