
బాదం.. ముందునుంచీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. వీటిని ఇప్పటికి చాలా మంది రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఎండుద్రాక్ష రాత్రి నానబెట్టి ఉదయం చూడగానే అవి తిరిగి పండులా మారుతాయి. ఇక, బాదం, కిస్‌మిస్లలో విటమిన్ ఈ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్పలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు జీర్ణ క్రియ కూడా ప్రోత్సహిస్తుంది. మీ చర్మం ఆరోగ్యకరంగా మెరుస్తూ కనిపిస్తుంది.

బాదం, కిస్మిస్ నానబెట్టి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ సహజ సిద్ధమైన శక్తి రూపంలోకి మారుతుంది దీంతో మీ ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఉంటాయి. అంటే నానబెట్టిన కిస్మిస్ తీసుకోవడం వల్ల రోజంతటికీ కావాల్సిన శక్తి అందుతుంది. కిస్మిస్ నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

నానబెట్టిన ఈ బాదం కిస్మిస్ తీసుకోవడం వల్ల జీవ క్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతో కడుపు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా నానబెట్టిన కిస్మిస్లు ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. వీటిని తరచూ మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.

నానబెట్టిన బాదం కిస్మిస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ కిస్మిస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, బిపి లెవెల్స్ ని కూడా అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.

బాదం నానబెట్టి తినడం వల్ల మెదడు కణాల్లో ప్రోటీన్లు ఎక్కువగా అబ్జార్వ్ చేసుకుంటుంది. బాదంపప్పులోని ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంతా కూడా బ్రెయిన్ హెల్త్‌కి చాలా మంచిది. నల్లద్రాక్షని ఫైబర్ జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. అదే విధంగా, పాలీఫెనాల్స్, ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్, కంటి శుక్లాల సమస్య దూరమవుతుంది.