Shiva Prajapati |
Jul 16, 2022 | 5:23 PM
Cooking Food: అల్యూమినియం పాత్రలో వండటం వల్ల, అల్యూమినియం కంటెంట్ ఆహారంలో కూడా కలుస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కారణం అవుతుంది.
చిత్తవైకల్యం: అల్యూమినియం పాత్రలు వినియోగించే చాలా మంది చిత్త వైకల్యంతో బాధపడుతున్నట్లు అనేక పరిశోధనల్లో తేల్చారు. సాధారణంగా అల్యూమినియం పాత్రలను అన్న వండటానికి, రైస్ కుక్కర్, కూరగాయలు వండటానికి వినియోగిస్తుంటారు.
అధ్యయనం ఏం చెబుతోంది?: అల్యూమినియం వంటసామాను వినియోగం కారణంగా అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నాయి. ఇది నరాల బలహీనతకు కూడా దారి తీస్తుంది.
అల్యూమినియం పాత్రలను వినియోగించడం తగ్గించాలని, ఇతర పాత్రలను ఉపయోగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
అల్యూమినియం పాత్రల్లో ఉడికించిన ఆహారం తినడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కావున తస్మాత్ జాగ్రత్త.