
కలబందను ఎక్కువగా ఉపయోగించడం లేదా తలకు ఎక్కువసేపు అప్లై చేసి ఉంచడం వల్ల కూడా చికాకు వస్తుంది. కాబట్టి జుట్టుకు అప్లై చేసే ముందు ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఇది చర్మంపై ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించకపోతే అప్పుడు వినియోగించాలి.

కలబంద ఆకులలో రబ్బరు పాలు ఉంటుంది. ఇది అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల అలెర్జీ ప్రతిచర్య ప్రమాదాన్ని పెంచుతుంది. కలబంద చర్మానికి మేలు చేసినప్పటికీ, మీరు దాని కొమ్మ నుండి నేరుగా జెల్‌ను తీసి అప్లై చేస్తే, అది అలెర్జీలకు కూడా కారణం కావచ్చు. దీనివల్ల చర్మంపై అలర్జీ, కళ్లు ఎర్రబడడం, దద్దుర్లు, మంట, దురద వంటి సమస్యలు వస్తాయి.

గర్భీణీలు కలబందను నోటికి తగలకుండా చూసుకోవాలి. కడుపులోకి తీసుకోరాదు. ఇది గర్భాశయ సంకోచానికి కారణమవుతుంది. ఇది గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, అలోవెరా జ్యూస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.

కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది కాకుండా, కలబందను అధికంగా ఉపయోగించడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వస్తుంది. కలబందలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇది కాలేయం నిర్విషీకరణ ప్రక్రియను అడ్డుకుంటుంది.

కలబందను అధికంగా తీసుకోవడం వల్ల గుండె కొట్టుకోవడం మందగిస్తుంది. దీని వల్ల శరీరంలో అలసట, బలహీనత వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలోవెరా జెల్ ఉపయోగించే ముందు, డాక్టర్ సలహా తీసుకోవాలి.