స్వీట్ పొటాటోలో అధిక మోతాదులో విటమిన్ బి 6 , పొటాషియం ఉంటుంది. కాబట్టి గుండెపోటు ప్రమాదాన్ని ఇది ఎక్కువగా తగ్గిస్తుంది. ఇక ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఎముకల..దంతాల దృఢత్వానికి ,ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఆడవారిలో క్యాల్షియం కంటెంట్ బాగా తగ్గుతుంది దీని ప్రభావం నేరుగా వాళ్ళ ఎముకలపై పడుతుంది. అలాంటివారు తప్పకుండా ఈ సీజన్లో దొరికే స్వీట్ పొటాటోస్ బాగా తీసుకోవాలి.
పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా స్వీట్ పొటాటోస్ నిరభ్యంతరంగా తినవచ్చు. స్వీట్ పొటాటో స్మూతీస్ ..ఇంకా సూప్స్ కూడా చేసుకొని తాగవచ్చు.
మూత్రపిండాల సమస్యలకు ,కండరాల వాపులు.. తిమ్మిర్లు వంటి వాటికి కూడా చిలగడ దుంప మంచి మందుగా పని చేస్తుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్ దీని కూడా అందిస్తుంది.
స్వీట్ పొటాటో మన శరీరంలో ఎర్ర ,తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంపొందించి డిప్రెషన్ను బాగా తగ్గిస్తుంది. స్వీట్ పొటాటో రెగ్యులర్ గా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్ లు శరీరంలో వృద్ధి చెందకుండా ఉంటాయి.