మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యమైన ధాన్యాలలో రాగులు ఒకటి. మిల్లెట్లను వివిధ మార్గాల్లో, పలు ఆహార పదార్థాలలో వినియోగిస్తారు. రాగిపిండితో ఎన్నో ప్రయోజనాలున్నాయి... రాగి ముద్ద, రాగి రోటీ, రాగి గంజి, రాగి అంబలి ఇలా పలు రకాలుగా తయారు చేసుకోని తీసుకుంటారు. మిల్లెట్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగులు పిల్లల సరైన అభివృద్ధికి కూడా ఉపయోగపడుతాయి.. వృద్ధులు, మహిళలు ఎముకల బలానికి మిల్లెట్ మాల్ట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. రాగి గంజి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..