చూసేకి వింతగా ఉన్నా.. ఆరోగ్యానికి అమృతం ఈ పండు!

Updated on: Aug 13, 2025 | 6:17 AM

కివి పండు.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అందుకే రోజూ ఒక కివి తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు..

1 / 5
కివిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కివిలో ఉండే ఆక్టినిడిన్ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది కడుపు సమస్యలను తగ్గిస్తుంది.

2 / 5
కివీలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కివీస్ లోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

3 / 5
కివిలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పదార్థాలు చర్మాన్ని మెరుగుపరచడంలో, ముడతలను తగ్గించడంలో, చర్మం స్థితిస్థాపకతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. కివి తినడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి.

4 / 5
కివిలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు కివి తినడం వల్ల మంచి నిద్ర వస్తుందట. నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజుకో కివి తింటే కమ్మని నిద్ర వస్తుంది.

5 / 5
కివిలో లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ళకు మేలు చేస్తాయి. ఈ పదార్థాలు కంటిశుక్లం, వయస్సు సంబంధిత కంటి సమస్యల నుంచి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.