Carrot juice: చలికాలంలో రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే.. ఏమవుతుందో తెలుసా..?

|

Nov 13, 2024 | 7:11 AM

Health Benefits: చలికాలం మొదలైపోయింది. శీతాకాలంలో అనేక పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో ఎటు చూసిన తాజా పండ్లు, కూరగాయలు కనువిందు చేస్తుంటాయి. వాటిలో క్యారెట్‌ ఒకటి. దీనిలో పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. క్యారట్స్ లో విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. క్యారెట్స్ ను చాలా మంది పచ్చివి తినేందుకు ఇష్టపడుతుంటాయి. కానీ, పచ్చివి తినేకంటే జ్యూస్ గా చేసుకుని తాగటం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యానికి అనేక బెనిఫిట్స్ లభిస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
క్యారెట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసి తాగడం వల్ల బాడీలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. దీనివల్ల సగం అనారోగ్య సమస్యలు దరిచేరవు. అనేక ఇన్ఫెక్షన్లు రాకుండా విటమిన్ సి కాపాడుతుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అలసట లేకుండా యాక్టివ్‌గా ఉంటారు.

2 / 5
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, వ్యర్థాలను తొలగించడంలో కూడా క్యారెజ్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఎలాంటి కంటి సమస్యలు రాకుండా కూడా చేస్తుంది.

3 / 5
క్యారెట్‌లో బీటా - కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని మన మానవ శరీరం విటమిన్‌- ఎ కిందకు మార్చుకుంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్‌ సి ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. శీతాకాలంలో ఎక్కువగా వేధించే.. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. ఈ సీజన్‌లో రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే.. ఆరోగ్యంగా ఉంటారు.

4 / 5
క్యారెట్‌లో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి చర్మం నేచురల్‌గా కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. చర్మం మృదువుగా ఉండటంతో పాటు ఎలాంటి ముడతలు, మొటిమలు లేకుండా చేస్తుంది. యవ్వనంగా కనిపించే చర్మాన్ని ఇస్తుంది. మొటిమలను కూడా తొలగిస్తుంది.

5 / 5
ఉదయాన్నే క్యారెట్‌ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరానికి నేచురల్ గ్లో వస్తుంది. ఇందులోని ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో చిరు తిండ్లు తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్‌లో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ క్యారెజ్ జ్యూస్ బాగా సాయపడుతుంది.