
ప్రస్తుత ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా తినే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడం దీనికి కారణం. అయితే పోషకాలతో కూడిన దుంపకూరలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూంన్సరు పోషకాహార నిపుణులు. ఆలుగడ్డ, చిలగడదుంప, చామగడ్డతో పాటు ముల్లంగిలో శరీరానికి కావలసిన ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, కేలరీలు లభిస్తాయి.

చాలామంది సాంబారులో తినే ముల్లంగి ముక్కలను ఇష్టంగా తింటారు.ఈ ముల్లంగి కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అందరికి అందుబాటులో ఉన్న కూరగాయల్లో ముల్లంగి ఒకటి. ఇది ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అందుకు దీనిలో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా ఒక కారణం. ముల్లంగిని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది.

ముల్లంగిలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ దీని వల్ల కరిగిపోతుంది.

ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

గుండె సమస్యలు ఉన్నవారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది. అలాగే మధుమేహం ఉన్నవారు ముల్లంగిని తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.