పిస్తాలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బయటకు పంపి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా పప్పు తినడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.