బీట్‌రూట్‌ మాత్రమే కాదు.. ఆకులు కూడా బంగారమే..! ఊహించని లాభాలు..

బీట్‌రూట్ ప్రయోజనాల గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే.. కానీ బీట్‌రూట్ ఆకుల ప్రయోజనాల గురించి మీకు తెలుసా? బీట్‌రూట్‌ మాదిరిగానే బీట్‌రూట్‌ ఆకుల్లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ఐరన్‌ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

బీట్‌రూట్‌ మాత్రమే కాదు.. ఆకులు కూడా బంగారమే..! ఊహించని లాభాలు..
Beetroot Leaves

Updated on: Nov 05, 2025 | 8:48 PM

బీట్‌రూట్‌ ఆకుల్లో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్‌ ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌ ఆకులు తింటే గట్‌ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణ సమస్యలు రావు. బీట్‌రూట్‌ ఆకులు తింటే ఫెర్టిలిటీ రేటు పెరుగుతుంది. ఇందులోని ఫోలేట్‌ శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. బీట్‌రూట్‌ ఆకుల్లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ను పెంచుతాయి. రక్తపోటును కంట్రోల్‌ చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ ఎ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీట్‌రూట్‌ ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి అధిక మోతాదులో లభిస్తుంది. ఇవి ఎముకలను బలంగా, ఆరోగ్యవంతంగా మార్చుతాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్‌రూట్‌ ఆకులు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బీట్‌రూట్‌ ఆకులు తింటే వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు.. బీట్‌రూట్‌ ఆకుల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్‌ అందిస్తుంది. ఫలితంగా తక్కువ తింటారు. దీంతో బరువు తగ్గొచ్చు. సూప్స్‌, సలాడ్స్‌ రూపంలో వీటిని తీసుకోవచ్చు.

బీట్‌రూట్ ఆకులను తినడం వల్ల శరీరంలో రక్త లోపం తొలగిపోతుంది. ఇందులో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడే ఇనుము ఉంటుంది. బీట్‌రూట్ ఆకులలో విటమిన్లు, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణను అందిస్తుంది. మెరిసే చర్మానికి బీట్‌రూట్ ఆకులను తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి బీట్‌రూట్ ఆకులు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బీట్‌రూట్‌ ఆకులనుపేస్ట్ లా తయారు చేసి జుట్టుకు పూయడం ద్వారా జుట్టు రాలడం సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే, దీని వినియోగం జుట్టు రాలడాన్ని తగ్గించే విటమిన్ బి12 లోపాన్ని తొలగిస్తుంది. బీట్‌రూట్ ఆకులను కూరగా కూడా ఉపయోగిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..