
అందరికీ జామకాయ గురించే తెలుసు. కానీ జామ కాయలే కాదండోయ్ జామ ఆకులతో అద్భుతమైన టీని కూడా తయారు చేసుకోవచ్చునంట. జామ ఆకుల టీలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ సమ్మేళనాలు , పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువలన ఇది చర్మానికి, ఆరోగ్యానికి చాలా మంచిదంట.

జామ ఆకుల టీలో బయోయాక్టివ్ రసాయన సమ్మేళనాలు ఉండటం వలన ఇది మానవ శరీరంలోని జీవక్రియను మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా ఇందులో ఉండే, ఫ్లేవనాయిడ్లు, ట్రైటెర్పెనాయిడ్లు, సెస్క్విటెర్పెనెస్, గ్లైకోసైడ్లు, ఆల్కలాయిడ్స్, సాపోనిన్లు , ఇతర ఫినోలిక్ సమ్మేళనాలు వంటివి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, మధు మేహం, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది.

జపాన్‌లో దీనిని ఎక్కువగా తీసకుంటారు. డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు , రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రతి రోజూ భోజనం తర్వాత జామాకు టీ తీసుకుంటారు. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్, పాలీఫఎనాల్స్ ఉంటాయి. అందువలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుంది.

అసలు ఈ జామకు టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..4-5 జామ ఆకులను బాగా కడిగి, మురికిని తొలగించండి. ఒక సాస్పాన్‌లో 2 కప్పుల నీటిని వేడి చేసి, మరిగించి, ఆ ఆకులను జోడించండి. వాటిని 10-12 నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించండి. మంటను ఆపివేసి, మూతపెట్టి, టీని మరో 5 నిమిషాలు నానబెట్టండి. ఒక కప్పులో వడకట్టండి. కావాలనుకుంటే తేనె లేదా నిమ్మకాయ వేసి, వెచ్చగా తినండి.

ఇందులో విటమిన్ ఎ , యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంత మందిలో వయసు పెరిగే కొద్దీ, అస్పష్టమైన దృష్టి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు ప్రతి రోజూ ఈ టీ తాగడం చాలా మంచిదంట. అంతే కాకుండా ఇది తల తిరగడం, కంటి అలసట, వణుకు వంటి సమస్యలను, రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడానికి ఉపయోగపడుతుందంట.