
కెఫిన్ ఫ్రీ: కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనికి బదులుగా శంఖు పువ్వు టీ తాగొచ్చు. ఈ టీ కెఫిన్ రహితమైనది. కావున దీనితో ఉత్తమ ప్రయోజనం ఉంటుంది.

బరువు తగ్గడంలో సహాయం: శంఖు పువ్వులో బరువు తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఈ పువ్వు కొవ్వు పెరుగుదలను నెమ్మదిస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్య నుండి రక్షిస్తుంది. బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

డిటాక్సిఫైయింగ్ ఏజెంట్లు: ఈ టీలో ఫైటోకెమికల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు కారణంగా శరీరం నుండి విషాన్ని తొలగించి మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది: ఈ టీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో హైడ్రేటింగ్ ఏజెంట్లు యాంటీ ఏజింగ్ సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు కొల్లాజెన్‌ను పెంచుతాయి. ఇది చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడం ద్వారా యాంటీ-గ్లైకేషన్ లక్షణాలను అందిస్తాయి.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: బ్లూ టీలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను బలపరిచే లక్షణాలను అందిస్తాయి. దీంతో ఉండే ఆంథోసైనిన్ స్కాల్ప్‌కి రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్: ఈ బ్లూ టీలో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ టీ గుండె సమస్యలు, మెటబాలిక్ సిండ్రోమ్, హైపర్ కొలెస్టెరోలేమియా వంటి వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.

మూడ్ అప్లిఫ్టర్: ఈ టీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో ఈ టీ ఉపయోగపడుతుంది.