- Telugu News Photo Gallery Cricket photos Ashes 2023 eng vs aus 5th test australia star player steve smith breaks don bradmans record at the oval
Ashes 2023: ఓవల్‌లో సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డుకు బీటలు.. బ్రేక్ చేసిన కోహ్లీ మెచ్చిన ప్లేయర్..!
Steve Smith: తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ తరుపున 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్.. జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచి 38వ టెస్టు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Updated on: Jul 29, 2023 | 11:17 AM

ఓవల్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్ చివరి మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ టీంపై 12 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకుంది.

ఆసీస్ తరపున తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్.. ఆ జట్టు తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచి 38వ టెస్టు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండ్ ప్లేయర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డును బ్రేక్ చేశాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన స్మిత్, ఓవల్‌లో ఒక టెస్ట్ బ్యాట్స్‌మెన్ (ఆదేశ జట్టు మినహా) అత్యధిక పరుగులు చేసిన జాబితాలో బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు.

ప్రస్తుతం ఓవల్‌లో టెస్టు క్రికెట్‌లో 617 పరుగులు చేసిన స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మరి ఈ ఫీల్డ్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేశారో చూడాలంటే..

617 - స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)

553 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా)

478 - అలాన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)

448 - బ్రూస్ మిచెల్ (దక్షిణాఫ్రికా)

443 - రాహుల్ ద్రవిడ్ (భారతదేశం)




