
కరివేపాకు జ్యూస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో.. కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని అంటున్నారు. 10 కరివేపాకు ఆకులను గోరు వెచ్చని నీటిలో వేసి గ్రైండ్ చేసి.. ఉదయాన్నే తాగాలి. దీని వల్ల బరువు సులభంగా తగ్గుతారు.

ఈ జ్యూస్.. జుట్టు, చర్మానికి సైతం మంచిది. ఈ రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కరివేపాకు మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. లివర్ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. రెగ్యులర్‌గా తీసుకుంటే లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి. కరివేపాకులో ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మన బాడీలోని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. దీని వల్ల మంట, వాపు వంటి సమస్యలు ఉండవు.

రోజూ ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉంటాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఐరన్ లోపాన్ని తగ్గించడంలో కరివేపాకులో క్రియాశీలకంగా పని చేస్తుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

ఐరన్ లోపం మహిళ్లలో అధికం. వీరికి ఇది చాలా ఉపయోగకరం. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ ఆకులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ పోషకాలు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మంపై ఉన్న ముడతలు, మొటిమలు, ఇతర సమస్యలను తగ్గిస్తుంది.