Tamarind Benefits: పుల్లగా ఉండే ఈ చింతపండులో ఎన్నో ఔషద గుణాలు.. ఆ సమస్యలకు చెక్..
ప్రస్తుత జీవనవిధానంతో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఆ బరువు తగ్గేందుకు నానా పాట్లు పడుతున్నారు. అయితే పలు పదార్థాలు తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేస్తే బరువు తగ్గొచ్చు. బరువు తగ్గించేందుకు తీసుకున్న ఆహారాల్లో చింతపండు ఉందని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా చింతపండును తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. చింతపండు లేనిదే భారతీయ వంటకాలు పూర్తి అవ్వవు. పుల్లగా ఉండే ఈ చింతపండులో ఎన్నో ఔషద గుణాలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. చింతపండులో ఉన్న ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.