
వినాయక చవితి, నవరాత్రులు గడిచాయంటే వచ్చేది పితృపక్షం. ఈ 16 రోజుల కాలంలో చనిపోయిన పూర్వీకులను పూజిస్తారు. నల్ల నువ్వులతో నీళ్లను సమర్పిస్తారు. నల్ల నువ్వులను ప్రసాదంగా కూడా తింటూ ఉంటారు. అయితే, నల్ల నువ్వులు తినటం వల్ల మనలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నల్ల నువ్వులు తినటం వల్ల శరీరాన్ని రక్షించడమే కాకుండా మన శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతాయి. నువ్వుల్లో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. నల్ల నువ్వుల్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. దీంతో కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు.

నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముక ఆరోగ్యానికి నల్ల నువ్వులు చాలా మంచిది.

నల్ల నువ్వుల నూనె రక్త ప్రసరణ, ఆక్సిజన్ కణజాలాలకు అందించడంలో సహాయపడుతుంది. నల్ల నువ్వుల నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. నల్ల నువ్వుల నూనెలో కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరిస్తాయి. నల్ల నువ్వుల నూనె చర్మాన్ని హైడ్రేట్ చేసి పోషణ అందిస్తుంది. నల్ల నువ్వులు తరచూ చర్మంపై ఉపయోగిస్తే మచ్చలు, ముడతల తొలగిస్తుంది.