ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ అద్భుతమైన లాభాలు..!

Updated on: Apr 07, 2025 | 8:57 AM

ఎండుద్రాక్ష.. దీనినే కిస్‌మిస్ అంటారు..డ్రైఫ్రూట్స్‌లో ముఖ్యంగా కిస్‌మిస్ ఆరోగ్యానికి చాలా మంచివి. కిస్ మిస్ బాగా తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి. చూడటానికి చిన్నగా ఉన్నా అందులోని ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి చాలా శక్తినిస్తాయి. రోజూ గుప్పెడు కిస్‌మిస్‌లను తినటం వల్ల నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
 ఎండుద్రాక్షలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ నానబెట్టి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ఎండుద్రాక్షలో పొటాషియం, భాస్వరం, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  విటమిన్ బి కాంప్లెక్స్ రక్త పరిమాణాన్ని పెంచుతుంది, ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ కడుపులో గ్యాస్, ఆమ్లత్వం తగ్గిస్తుంది.

3 / 5
ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండుద్రాక్ష తినాలి. ఎండుద్రాక్ష పోషక విలువల పరంగా చాలా గొప్పది.

4 / 5
కిస్‌మిస్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కిస్‌మిస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కిస్‌మిస్‌లో ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా బరువు నిర్వహణకు సహాయపడతాయి.

5 / 5
అంతేకాదు..ఎండుద్రాక్ష గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును మెయింటెన్‌ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.