Liver Health: కాలేయాన్ని క్షేమంగా ఉంచే సూపర్ ఫుడ్స్.. ఈ 4 డ్రైఫ్రూట్స్ రోజూ తింటే..

Updated on: Jan 07, 2026 | 1:50 PM

Fatty Liver Diet: మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల భారీన పడుతున్నారు. వాటిలో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ముఖ్యంగా నాన్‌వెజ్ తినేవారిలో ఈ సమస్య వేగంగా పెరుగుతుంది. ఇది అధిక కోవ్వు కారణంగా వచ్చే వ్యాధి.. ఇది ప్రారంభంలో ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు, కానీ తరువాత తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి దీన్ని పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని డ్రైప్రూట్స్‌ తినడం వల్ల ఈ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు అదెలాగో తెలుసుకుందాం.

1 / 5
డ్రైఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతాయి. అందుకే చాలా మంది ఉదయాన్నే వాటిని తినేందుకు ఇష్టపడుతారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన కాలేయాన్ని నిర్వహించడానికి, వాపును తగ్గించడానికి, కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ఈ రోజు మనం కొవ్వు కాలేయాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.

2 / 5
వాల్‌నట్స్‌: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన కాలేయాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి. వాటి శోథ నిరోధక లక్షణాలు కొవ్వు నిల్వలను తగ్గించడంలో, కాలేయ ఎంజైమ్‌లను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీరు వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా తినవచ్చు. రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం మరింత ప్రయోజకరంగా ఉంటుంది.

3 / 5
బాదం: బాదంలో విటమిన్ E, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి కాలేయంలో కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి, ఇది కొవ్వు కాలేయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం సాధారణంగా మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు లేదా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తినడం మంచిది.

4 / 5
 పిస్తాపప్పుల: వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. అవి శరీరం కొవ్వు జీవక్రియలో పాల్గొనే జన్యువుల పనితీరును మెరుగుపరచడంలో, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పిస్తాపప్పులు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంటుంది. అలాగే కాలేయ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు మార్నింగ్ వర్కౌట్స్‌కు ముందు వీటిని తినడం ఉత్తమం

5 / 5
పెకాన్ గింజలు: పెకాన్ గింజలు ఇవి వాల్‌నట్ రకానికి చెందినవి.. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి కాలేయ వాపును తగ్గించడంలో, కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో సహాయపడతాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాలేయ కొవ్వును తగ్గించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.