Harsingar Benefits: పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ఇలా చేస్తే ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?

|

Nov 04, 2021 | 9:40 PM

Benefits of Harsingar: పారిజాతం పూలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో పారిజాతం మొక్కను, ఆకులను, పూలు, గింజలను ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో ఉన్న ఔషధ గుణాలు పలు రకాల వ్యాధులను నయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
పారిజాతం చెట్టు రాత్రిపూట మాత్రమే పువ్వులు పూస్తుంది. ఉదయం పూట ఆ పూలన్నింటినీ రాల్చివేస్తుంది. దీనిని నైట్ క్వీన్‌గా పిలుస్తారు. దీని ఔషధ నామం Nyctanthes arbor-tristis. పారిజాతాన్ని నైట్‌ జాస్మిన్ అని కూడా అంటారు. దీని తెల్లని పువ్వులు సువాసనతో మైమరిచిపోయేలా చేస్తాయి.

2 / 5
పారిజాతం ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంది. దీని ఆకులు, బెరడు, పువ్వులు ఆర్థరైటిస్ నుంచి పేగు సంబంధిత వ్యాధులు, పలు వైరస్‌ కారకాలను నయం చేయడంలో సహాయపడతాయి.

3 / 5
పారిజాతంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు లాంటి చికిత్సకు ఉపయోగిస్తారు.

4 / 5
కీళ్లనొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందేందుకు పారిజాత ఆకులు, బెరడు, పువ్వులతో కషాయాలుగా తయారు చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, సైనస్‌ ఇబ్బందులను తగ్గించుకునేందుకు పారిజాతం టీ చేసుకోని తాగాలి. ఒక గ్లాసు నీళ్లలో 2-3 ఆకులు, 4-5 పువ్వులు, 2-3 తులసి ఆకులను వేసి మరిగించి తాగాలి.

5 / 5
జ్వరం తగ్గేందుకు 3 గ్రాముల బెరడు, 2 గ్రాముల ఆకులతో పాటు 2-3 తులసి ఆకులను నీటిలో మరిగించి రోజుకు రెండుసార్లు తాగాలి. ఈ కషాయం తాగడం వల్ల జ్వరంతోపాటు నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యలు తెలుపుతున్నారు.