
జుట్టు రాలడం, వెంట్రుకలు బలహీనపడటం, చుండ్రు ఈ రకమైన సమస్యలు దాదాపు స్థిరంగా ఉంటాయి. కానీ చాలా మంది బహిరంగంగా చెప్పుకోవడానికి ఇబ్బంది పడే సమస్య పేను. తల్లో పేళ్లకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఆ పేళ్లను వదిలించుకోవడానికి కొన్ని చర్యలు చేపట్టాలి.

పేళ్లను వదిలించుకోవడానికి మార్కెట్‌లో అనేక షాంపూలు ఉన్నాయి. కానీ అవి 100 శాతం పని చేస్తాయని హామీ ఇవ్వలేం. షాంపూను వాడినప్పటికీ.. ఆ సమస్య పోవడానికి చాలా సమయం పడుతుంది.

షాంపూని ఉపయోగించిన తర్వాత పేళ్ల సమస్య తగ్గకపోతే ఇంటి నివారణలను ట్రై చేయొచ్చు. వీటి సాయంతో ఒక వారంలోనే పేళ్ల సమస్య నుంచి బయటపడొచ్చు.

షాంపూతో స్నానం చేయడానికి ముందు వెనిగర్‌ను తలకు పట్టించాలి. వెనిగర్ పేనును చంపడానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. కొద్దిగా వెనిగర్‌ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. స్కాల్ప్ మొత్తానికి వెనిగర్ పట్టించారు. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత షాంపూతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 3 రోజులు వెనిగర్‌తో క్లీన్ చేసి సమస్య పరిష్కారం అవుతుంది.

వేప ఆకులను ఉపయోగించొచ్చు. వేప ఆకులు పేను సమస్యను తగ్గిస్తుంది. వేప ఆకులను గ్రైండ్ చేసి, పుల్లటి పెరుగుతో కలిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని హెయిర్ ప్యాక్ లా వేసుకోవాలి. లేదా వేప ఆకు నూనె తయారు చేసి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పేను సమస్య త్వరగా తగ్గుతుంది.

పేను సమస్యను తొలగించడంలో టీ ట్రీ ఆయిల్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. జుట్టుకు గుడ్డ చుట్టుకుని పడుకోవాలి. ఉదయాన్నే లేచి షాంపూ పెట్టుకుని శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి, 5 లవంగాలను మిక్స్ చేయాలి. అందులో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. జుట్టు చుట్టూ షవర్ క్యాప్ లేదా టవల్ కట్టుకోవాలి. కాసేపటి తరువాత షాంపూతో క్లీన్ చేసుకోవాలి. జుట్టు సమస్య నుంచి త్వరగా విముక్తి కలిగిస్తుంది.

ఉల్లిపాయ రసం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా ఉల్లి పేను సమస్యను దూరం చేస్తుంది. ఉల్లిపాయలలో సల్ఫర్ ఉంటుంది. ఇది పేళ్లను చంపడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి రెండు గంటలపాటు వేచి ఉంచాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది పేళ్ల సమస్యను తొలగించడమే కాకుండా, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.