Hair Care Tips: జుట్టు రాలిపోతోందా? కరివేపాకు, అవిసెగింజలు, వేపాకులు..! రోజూ పరగడుపున..

|

Mar 07, 2022 | 9:35 AM

Hair care tips at home: కాలుష్యం, ఆహార అలవాట్లు, ఆరోగ్య సమస్యలు కారణాలేమైతేనేమి.. అపురూపంగా చూసుకునే జుట్టు కళ్ల ముందే రాలిపోతుంటే ఎంతో బాధగా ఉంటుంది. ఐతే ఈ చిట్కాలు పాటించారంటే మీ జుట్టు పట్టుకుచ్చులా పెరిగి అందంగా తయారవుతుంది.

1 / 5
కరివేపాకులో ఉండే విటమిన్ సి, ఐరన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 3 - 4 ఆకులను తిన్నారంటే కొన్ని రోజుల్లోనే జుట్టు పెరుగుదలలో మార్పులను మీరే చూస్తారు.

2 / 5
జుట్టుకు అవసరమైన ఒమేగా-3 అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పరగడుపున అవిసె గింజలు నానబెట్టిన నీటిని లేదా అవిసె గింజల పొడిని నీటిలో కలుపుకుని అయినా తాగొచ్చు.

3 / 5
సహజ ఔషధంగా పేరుగాంచిన వేప ఆకులు పొట్టకే కాకుండా జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెప్పేమాట.

4 / 5
కొబ్బరి నీరు ఆరోగ్యానికేకాకుండా.. జుట్టు, చర్మం, జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లు జుట్టు పెరుగుదలకు ఉపయోగ పడతాయి. సిట్రస్ పండ్ల రసాన్ని ఖాళీ కడుపుతో వారానికి మూడు సార్లు త్రాగాలి. ఐతే మీకు ఆరోగ్య సమస్యలున్నట్లయితే, నిపుణుల సలహా మేరకు తీసుకోవడం బెటర్‌!